టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగ చైతన్యలు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఇంతకాలం వారి విడాకులపై వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ విడిపోతున్నామని తాజాగా ప్రకటించారు. మూడేళ్లుగా ఎంతో అనోన్య దంపతులుగా ఉన్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ‘ఏం మాయ చేశావే’ మూవీతో స్నేహితులైన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడంతో.. దీనికి కారణాలేంటని సోషల్ మీడియాలో నెటిజనులు చర్చించుకుంటున్నారు.
చదవండి: బ్రేకింగ్: సమంత-నాగ చైతన్య విడాకులు
సమంత వల్లే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ అంటే టాలీవుడ్‌లో ఓ బ్రాండ్ ఉంది. అలాంటి కుటుంబానికి కోడలిగా వెళ్లిన సమంత వారి పద్ధతులను పట్టించుకోకపోవడం వల్లే వారి మధ్య విభేదాలు తలెత్తాయని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంతేగాక సినిమాల పరంగా నిర్ణయాలు తీసుకుంటూ వరుస ప్రాజెక్ట్స్ సమంత ఒకే చేయడం, ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో నటించడం కూడా కారణమనుకుంటున్నారు మరికొంతమంది.
ఈ మధ్య సమంత గ్లామర్ ఫొటోలు ఎక్కువగా షేర్ చేయడం, కురచ దుస్తుల్లో ఫొటోషూట్‌లు ఇవ్వడం చైతుకు నచ్చలేదని, దీంతో వీరి మధ్య దూరం పెరిగిందంటూ ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియా సమంత ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది, దీనికి చైతన్య వ్యతిరేకం. ఇక సినిమాల సక్సెస్ రేటు కూడా చైతుతో పోలిస్తే సమంతకే ఎక్కువ ఉందని, ఇది కూడా ఒక కారణమని పలువురు పేర్కొంటున్నారు. అలాగే ‘లాల్ సింగ్ చద్ధా’ మూవీ షూటింగ్‌లో భాగంగా చై నార్త్‌కు వెళ్లిన సమయంలోనే వారి మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయట. ఏది ఏమైనా తమ ఎంతగానో అభిమానించే సినిమా కుటుంబంలో కలత రేగడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
చదవండి: ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం: నాగ చైతన్య
— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2021
Comments
Please login to add a commentAdd a comment