టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల నేపథ్యంలో 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ముందుగా ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగంగానే నేడు (జూన్ 24) వ్యూహం టీజర్‌ను రిలీజ్ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదంతో టీజర్ ప్రారంభం అవుతుంది. సీఎం జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది ?, ఆ సమయంలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ? లాంటి అంశాలను ప్రస్తావిస్తూ టీజర్ సాగింది. టీజర్ మొత్తంలో ఒకేఒక్క డైలాగ్‌తో సినిమాపై భారీ అంచనాలను వర్మ పెంచేశాడు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్, భారతీగా మానస నటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment