
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అతడి ప్రేయసి రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్టయింది. 28 రోజులపాటు జైలు జీవితం గడిపింది. తన సోదరుడు షోవిక్ కూడా జైలు శిక్ష అనుభవించాడు. అయితే బయటకు వచ్చాక కూడా తనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే తను నాలుగు గోడల మధ్య నరకయాతన అనుభవిస్తుంటే తన కుటుంబం, స్నేహితులు మాత్రం బాగా తిని లావయ్యారంటోంది.
బయటకు వచ్చేసరికి..
తాజాగా రియా చక్రవర్తి మాట్లాడుతూ.. నేను ఇంటికి దూరమైనప్పుడు ఫ్రెండ్సే నా పేరెంట్స్‌ను దగ్గరుండి చూసుకున్నారు. నాన్నతో కలిసి రోజూ తాగేవారు, తినేవారు. నేను బయటకు వచ్చాక.. ఏంటి? ఇంత లావయ్యారు? అని ఆశ్చర్యపోయాను. నేను జైల్లో ఉంటే మీరు బాగా తిని బరువెక్కారా? అని నిలదీశాను.
ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా..
అందుకు వాళ్లు.. లేదు, ఆంటీ, అంకుల్‌ను బాధ నుంచి బయటపడేసేందుకు వాళ్లతో కలిసి తాగాం, తిన్నాం అని చెప్పారు. నా ఫ్రెండ్సే నాకు రక్షణకవచాల్లా నిలబడ్డారు. అంత మంచి స్నేహితులు ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని. ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా ఉన్నా శిబానీ దండేకర్ మాత్రం నావైపే నిలబడింది అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment