
బంజారాహిల్స్: మణప్పురం మిస్సెస్ సౌత్ ఇండియా–2021 గ్రాండ్ ఫినాలె పోటీల్లో మిస్సెస్ తెలంగాణ టైటిల్‌ను రష్మీ ఠాకూర్, మిస్సెస్ ఆంధ్ర టైటిల్‌ను సునీత ధవళ గెలుచుకున్నట్లు డిక్యూ వాచెస్, పెగసస్ సంస్థల ప్రతినిధులు అజిత్‌రవి వెల్లడించారు.
గురువారం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొచ్చిలోని మెరీడియన్ హోటల్‌లో బుధవారం రాత్రి కనుల పండువగా గ్రాండ్ ఫినాలె పోటీలు జరిగాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ పోటీలకు దరఖాస్తు చేసుకున్నారని ఇందులో 20 మంది యువతులు టైటిల్‌పోరుకు ఎంపికయ్యారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment