RRR Actress Olivia Morris Visits Hyderabad: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా త్రం‘ఆర్‌ఆర్‌ఆర్’(రౌద్రం,రణం, రుధిరం). ఈ చిత్రంతో హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్(Olivia Morris) తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఈ హాలీవుడ్ బ్యూటీ, శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో చక్కర్లు కొట్టింది.
(చదవండి: ‘ఖడ్గం’ ఫేమ్ కిమ్ శర్మ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుంది?)
‘ఆర్‌ఆర్‌ఆర్’ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అనురెడ్డితో కలిసి ఆమె శిల్పారామం వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలకు, హస్తకళలకు ఆమె ముగ్ధులయ్యారు. సిటీ విధుల్లో చిరుతిళ్ళు, పానీపూరీలు తింటూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయి. స్వాతంత్య్రం కోసం ధైర్యసాహసాలతో పోరాడే కొమురం భీమ్(ఎన్టీఆర్)తో ప్రేమలో పడే బ్రిటిష్ వనిత పాత్రను ఒలీవియా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment