RRR Movie Trailer - Watch and Download | SS Rajamouli's Film Official Trailer Updates - Sakshi
Sakshi News home page

RRR Movie Trailer: ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ అదరహో..యాక్షన్‌ సీక్వెన్స్‌ సూపర్బ్‌!

Published Thu, Dec 9 2021 11:09 AM | Last Updated on Thu, Dec 9 2021 4:43 PM

RRR Movie Trailer - Sakshi

Watch and Download RRR Movie Trailer: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. 

 ‘పాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్న.. గర్వంతో గీ మన్నులో కలిసిపోతనే’అంటూ తెలంగాణ యాసలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చెప్పే డైలాగ్స్‌ ..  ‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’అంటూ రామ్‌ చరణ్‌ చెప్పే డైలాగ్స్‌ అదిరిపోయాయి.

భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమరమ్‌ భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలు పోషిస్తున్నారు. చెర్రీకి జోడిగా  బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ నటించగా, తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించారు. . పాన్‌ ఇండియా చిత్రంగా నిర్మితమైన RRR Movie సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement