Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది | RRR Team Released Intense Look Komaram Bheem Poster On Jr NTR Birthday | Sakshi
Sakshi News home page

RRR New Update Today: ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

Published Thu, May 20 2021 10:42 AM | Last Updated on Thu, May 20 2021 5:30 PM

RRR Team Released Intense Look Komaram Bheem Poster On Jr NTR Birthday - Sakshi

RRR New Update Today: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఎన్టీఆర్ బ‌ర్త్ డే(మే 20)సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’నుంచి ఆయన కొత్త లుక్‌ని విడుద‌ల చేశారు. ఇందులో కొమురం భీంగా ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బల్లెం గురిపెట్టి పోరాటానికి సిద్ధమైనట్లు ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ పోస్టర్‌ ప్రతిఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ‘నా భీమ్‌ బంగారు హృదయాన్ని కలిగి ఉన్నాడు. కానీ అతను తిరుగుబాటు చేసినప్పుడు, అతను బలంగా మరి ధైర్యంగా నిలుస్తాడు’ ఆర్ఆర్‌ఆర్‌ టీమ్‌  ట్వీట్‌ చేసింది. ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌధ్రం రణం రుధిరం). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కోమరం భీంగా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్‌.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement