
మరో వారంలో రామ్‌చరణ్ ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. దానికోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన తాజా చిత్రాల అప్‌డేట్స్‌ని ఆశించడం సహజం. బర్త్ డేకి ఫ్యాన్స్‌కు కొత్త పోస్టర్ రూపంలో గిఫ్ట్ ఇవ్వనున్నారు చరణ్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. చరణ్ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను బర్త్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో చరణ్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే శంకర్ డైరెక్షన్‌లో చరణ్ హీరోగా ఓ ప్యాన్ ఇండియన్ మూవీ రూపొందనుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా బర్త్ డేకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment