ముంబై : సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘తాండవ్’ వెబ్ సరీస్‌పై నిరసనల సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను కించపర్చారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా మహారాష్ట్ర కర్ణి సేన చీఫ్ అజయ్ సెంగర్ తాండవ్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లను అవమానించిన వారి నాలుక కోసినవారికి కోటి రూపాయల రివార్డు వరిస్తుందని ప్రకటించారు. తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం క్షమాపణలు కోరినా ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అజయ్ సెంగర్ అన్నారు. (తాండవ్‌పై శివాలెత్తుతున్న నెటిజన్లు)
ఇది వరకే తాండవ్ రూపకర్తలు, అమెజాన్ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ ఇండియా హెడ్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ అపర్ణ పురోహిత్, వెబ్‌సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు తాండవ్ సిరీస్ మీద శివాలెత్తుతున్నారు. తమ దేవుళ్లను ఎగతాళి చేశారని మండిపడుతున్నారు. తాండవ్‌ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ తాండవ్’, ‘బ్యాన్ తాండవ్’ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా వైరల్ చేస్తున్నారు. జనవరి 15న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్‌లో డింపుల్ కపాడియా, మహ్మద్ జీషన్ అయూబ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ సినిమాను తెరకెక్కించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. (తాండవ్ వివాదం: కొత్త ఇంటికి మారనున్న సైఫ్!)
Comments
Please login to add a commentAdd a comment