నట్టి, శిల్ప మంజునాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం వెబ్. మొటై రాజేంద్రన్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని వేలన్ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎం.మునివేలన్ నిర్మిస్తున్నారు. హరూన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెబ్.. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో నటుడు, నిర్మాత కె.రాజన్, దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్‌వీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. పలు హిందీ, తమిళ చిత్రాల కెమెరామెన్‌గా పనిచేసిన నట్టి ఆ తర్వాత నటుడిగా అవతారం ఎత్తారన్నారు. అందుకే మంచి కంటెంట్ కలిగిన కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారన్నారు. ఈ వెబ్ చిత్రం అలాంటి విభిన్న కంటెంట్‌తో కూడిన కథా చిత్రమని దర్శకుడు ఈ వేదికపై చెప్పారన్నారు. ఆయన ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆడియో, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందన్నారు. ఇప్పుడు దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేకపోయినా చిత్రాలు చేయవచ్చు అని, తమ కాలంలో తమను ఒక గ్రూపు సినిమాల్లోకి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు.
అలాంటి వారిలో ఆర్ సుందర్ రాజన్ ఒకరని.. తాను కథలు రాసుకొని ఆయన వద్దకు వెళ్లి అవకాశం కల్పించాల్సిందిగా కోరానన్నారు. అందుకు ఆయన మేమంతా కథలను రాసుకుని సినిమాలు చేసే టైప్ కాదని.. షూటింగ్ స్పాట్‌లోనే కథలు రాసి తెరకెక్కిస్తామని పరిహాసం చేశారన్నారు. అలా ఎన్నో అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వెబ్ చిత్రం మంచి విజయాన్ని సాధించి నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టాలన్నారు. అలా కాకపోయినా పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే ఆయన మళ్లీ ఇంకో సినిమా చేస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment