రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం సగిలేటి కథ’. నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరులో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి మాట్లాడుతూ – ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రం ‘సగిలేటి కథ’’ అన్నారు. ‘‘సగిలేటి కథ’ అనే నవల నా సినిమాకి ప్రేరణ మాత్రమే.. కథ పూర్తిగా ఒరిజినల్‌గా ఉంటుంది’’ అన్నారు రాజశేఖర్ సుద్మూన్ . ‘‘కేరాఫ్ కంచరపాలెం, బలగం’ వంటి చిత్రాల కోవలోనే ‘సగిలేటి కథ’ కూడా ఉంటుంది’’ అన్నారు సమర్పకుడు నవదీప్.
Comments
Please login to add a commentAdd a comment