పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమే 'సగిలేటి కథ' | Sagiletikatha Movie Second Lyrical Song Released Today | Sakshi
Sakshi News home page

Sagiletikatha Movie: రాయలసీమ పల్లె నేపథ్యంలో వస్తోన్న 'సగిలేటి కథ'

Published Wed, Aug 30 2023 4:11 PM | Last Updated on Wed, Aug 30 2023 4:16 PM

Sagiletikatha Movie Second Lyrical Song Released Today - Sakshi

రవి మహాదాస్యం విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’.  ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో షేడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ , అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.  

(ఇది చదవండి: ఆనంద్‌ దేవరకొండ సినిమాకు హీరోయిన్‌గా ప్ర‌గ‌తి.. బేబీకి నో ఛాన్స్‌)

రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ ‘రధన్’  చేతుల మీదుగా సాంగ్ విడుదల చేశారు.  కాగా.. ఈ చిత్రానికి జశ్వంత్ పసుపులేటి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సాంగ్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్  సభ్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. 

(ఇది చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement