
కోలీవుడ్‌లో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడని నటీమణుల్లో సాక్షిఅగర్వాల్ ఒకరు. కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించినా, ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగని కథానాయకి పాత్రలోనే నటిస్తానని మడి కట్టుకుని కూర్చోకుండా, వచ్చిన ఎలాంటి అవకాశాన్ని అయినా ఒప్పేసుకుని నటిస్తున్నారు. అలా రాజారాణి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన సాక్షి అగర్వాల్ ఆ తర్వాత కాలా, విశ్వాసం, టెడీ వంటి పలు చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. అయితే ప్రస్తుతం పంచ చిత్రాల్లో కథానాయకిగా నటిస్తున్నారు.
అలా ఈమె నటించిన గెస్ట్, ది నైట్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలు తన కెరీర్‌కు ప్లస్ అవుతున్నాయనే నమ్మకంతో ఉన్న సాక్షిఅగర్వాల్ తన పబ్లిసిటీ యుక్తిని బాగానే ప్రదర్శిస్తున్నారు. తరచూ ఇన్‌స్ట్రాగామ్‌లో తన గ్లామరస్ ఫొటోలను, వర్కౌట్స్ వీడియోలను పొందుపరుస్తూ అభిమానులను బాగా ఎంటర్‌టెయిన్ చేస్తున్నారు. అలా తాజాగా ఈమె వర్కౌట్ చేస్తున్న ఒక వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు.
అందులో ఎవరైనా ఇలా చేసి తనను అధిగమించగలరా అంటూ సవాల్ విసిరారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫ్రీ పబ్లిసిటీ కోసం సాక్షి అగర్వాల్ ఇలాంటివి తరచూ చేస్తుంటారన్నది గమనార్హం. అదేవిధంగా మంచి సత్తా కలిగిన పాత్ర లభిస్తే నటిగా తానేంటో నిరూపించుకుంటానని సాక్షిఅగర్వాల్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment