ప్రభాస్‌కు పెద్ద థ్యాంక్స్‌: శ్రుతీహాసన్‌ | Salaar Movie Heroine Shruti Haasan Food Diet | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌కు పెద్ద థ్యాంక్స్‌: శ్రుతీహాసన్‌

Published Mon, Aug 9 2021 12:40 AM | Last Updated on Mon, Aug 9 2021 8:09 AM

Salaar Movie Heroine Shruti Haasan Food Diet - Sakshi

మండీ బిరియానీ, గోంగూర మటన్, చేపల పులుసు, చికెన్‌ బిర్యానీ, పనీర్, కబాబ్, వెజ్‌ మంచూరియా, రెండు రకాల పప్పు కూరలు, రైస్, రసం...ఏంటీ ఈ ఫుడ్‌ మెను అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇవన్నీ ‘సలార్‌’ సినిమా సెట్స్‌లో హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ ముందు తినడానికి రెడీగా ఉన్న ఫుడ్‌ ఐటమ్స్‌ అన్నమాట. ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ‘సలార్‌’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. శ్రుతీహాసన్‌కు ప్రభాస్‌ తమ ఇంటి నుంచి ఫుడ్‌  తెప్పించారు. ఆ ఫుడ్‌ ఐటమ్స్‌ను చూపిస్తూ తాను ఏ సినిమా సెట్స్‌లోనూ ఇన్ని ఐటమ్స్‌ను ఒకేసారి టేస్ట్‌ చేయలేదని చెబుతూ ఓ వీడియోను షేర్‌ చేశారు శ్రుతి. ఇన్ని వంటకాలు పంపిన ప్రభాస్‌కు పెద్ద థ్యాంక్స్‌ అని కూడా అన్నారు. ఇక ‘సలార్‌’ విషయానికి విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను చిత్రబృందం త్వరలో విడుదల చేయనుందని తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement