టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. దేవ్ మోహన్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు సమర్పణలో నీలిమగుణ నిర్మించారు. మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది సామ్. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
ఇంతలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ ఆస్క్‌సామ్ సెషన్‌లో ఎంటరై సమంతను సూటిగా ఓ ప్రశ్న అడిగింది. 'శాకుంతలం సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఉంది. మీరే నా ఇన్‌స్పైరింగ్. నా ప్రశ్న ఏంటంటే.. మనమిద్దరం కలిసి సినిమా ఎప్పుడు చేస్తున్నాం?' అని ట్విటర్‌లో అడిగేసింది. దీనికి సమంత స్పందిస్తూ.. 'ముందుగా గుమ్రా సినిమా సక్సెస్ అయినందుకు శుభాకాంక్షలు. నీ ఐడియా నచ్చింది. కలిసి చేసేద్దాం' అని రిప్లై ఇచ్చింది. సామ్ స్పందనతో సంతోషం వ్యక్తం చేసిన మృణాల్.. 'థాంక్యూ.. ఇది జరగాలని ఆశిద్దాం' అని రాసుకొచ్చింది. వీరి చాట్ చూసిన అభిమానులు ఇద్దరూ ఒకే సినిమాలోనా? ఈ ఊహ ఎంత బాగుందో అని కామెంట్లు చేస్తున్నారు.
We already have a suggestion apparently ☺️@mrunal0801 https://t.co/isdMlAyFN2
— Samantha (@Samanthaprabhu2) April 9, 2023
Congratulations on #Gumraah beautiful @mrunal0801 🤍
— Samantha (@Samanthaprabhu2) April 9, 2023
Let’s do it.. 💪🏼 love the idea!! https://t.co/rqQqSbXWER
Comments
Please login to add a commentAdd a comment