మొత్తానికి మేము ఏడాది పూర్తి చేశాం: సామ్‌ వీడియో వైరల్‌ | Samantha Online Fashion Brand Saaki Successfully Turns One Year | Sakshi
Sakshi News home page

Samantha: ‘గతేడాదిలాగే ఎన్నో అనుభూతులను కలిసి పంచుకుందాం’

Published Tue, Sep 28 2021 8:59 PM | Last Updated on Tue, Sep 28 2021 9:03 PM

Samantha Online Fashion Brand Saaki Successfully Turns One Year - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి నేటికి సరిగ్గా ఏడాది. గతేడాది ఇదే రోజు ఆమె ‘సాకి’ పేరుతో ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 28తో  తన వెంచర్‌ ఏడాదిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది. కేక్‌ పట్టుకుని ఆనందంలో మునిగితేలుతూ చిందిలేస్తున్న ఈ వీడియోకు.. ‘మొత్తానికి మేము ఏడాది పూర్తి చేశాం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీడియో పంచుకుంది. అలాగే ‘తమ మ‌న‌సు, ఆత్మ‌ను ఇక్క‌డ పెట్టి ఇంతటి ఘన విజ‌యాన్ని సాధించేందుకు కృషి చేసిన ప్రతిభావంతులైన ‘సాకి’ బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నా.

చదవండి: Samantha: ఆమెతో కలిసి నటించడమే నా కల: బాలీవుడ్‌ హీరో

ఈ అసాధారణమై ప్రయణానికి కృతజ్ఞతలు. గతేడాది మాదిరిగా మున్ముందు కూడా మరిన్ని అనుభూతులు, మధుర జ్ఞాపకాలను కలిసి పంచుకుందాం’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అలాగే  గ‌త ఏడాది కాలంగా మీరు మా ప‌ట్ల చూపిస్తున్న ఆద‌ర‌ణ‌, ప్రేమ కొన‌సాగిస్తార‌ని ఆశిస్తున్నాను అంటూ కస్టమర్లకు కూడా సామ్‌ థ్యాంక్స్‌ చెప్పింది. దీంతో బిజినెస్‌ను సక్సెస్‌ఫుల్‌గా రాణించిన సమంతకు ఇండ‌స్ట్రీ స్నేహితులు, సన్నిహితులు శుభాంకాంక్ష‌లు తెలుపుతున్నారు. అంతేగాక హీరోయిన్స్‌ ప్ర‌గ్యాజైశ్వాల్‌, త‌మ‌న్నా, సంయుక్తా హెగ్డేలు ఈ సందర్భంగా సామ్‌కు అభినందనలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement