అక్కినేని పెద్ద కోడలు సమంత అప్పుడే బాధ్యతలు తన చేతుల్లోకి తీసుకుంటోంది. అదేంటి సామ్ ఇంటి బాధ్యతలు భుజాన మోస్తుందా? అని ఆశ్చర్యపోకండి. మరేమీ లేదు.. తన మరిది అఖిల్‌కు ఓ మాంచి సక్సెస్‌ను ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా యంగ్ డైరెక్టర్లు రాజ్, డీకేలు తీయబోయే సినిమా ప్రాజెక్ట్ అఖిల్‌కు వచ్చేలా చేసిందట. అదెలాగంటే.. సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే కదా! ఇందులో ఆమె టెర్రరిస్టు పాత్ర పోషించింది. ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ అండ్ డీకేలు తెరకెక్కించారు. ఈ క్రమంలో వారు తీయాలనుకుంటున్న ఓ సినిమా కథను సమంతకు వినిపించగా ఆమె చాలా ఇంప్రెస్ అయిందట. అయితే ఈ కథ తన మరిది అఖిల్‌కు అయితే బాగా సెట్టవుతుందని చెప్పిందట. అలా ఈ యాక్షన్ సినిమాను అఖిల్‌కు వచ్చేలా చేయడంలో సామ్ కీలక పాత్ర పోషించిందని సమాచారం. పైగా రాజ్, డీకేలు తెలుగువాళ్లు. ఇప్పటికే "డీ ఫర్ దోపిడీ" అనే సినిమాను సైతం తెరకెక్కించారు. (చదవండి: లతాజీ గొంతు బావుండదు..)
ఇదిలా వుంటే అఖిల్ ప్రస్తుతం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే కథానాయిక. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు. మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ దర్శకద్వయం రాజ్, డీకేలతో మరో సినిమా చేయనున్నాడు. దీన్ని అశ్విని దత్ నిర్మించనున్నాడు. (చదవండి: వైరల్: సామ్ గుట్టును బయటపెట్టిన చై!)
Comments
Please login to add a commentAdd a comment