
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఖుషి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. టర్కీలో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరకడంతో విజయ్‌తో కలిసి లంచ్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అంతే కాకుండా విజయ్‌తో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంది సమంత.
(ఇది చదవండి: పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్!)
సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నిన్ను చివర్లో ఉండటం చూశా. ఫస్ట్‌లో ఉండటం చూశా. నీ ఉన్నతమైన స్థితిని చూశా. నీ జీవితంలో ఎదుర్కొన్న ఎత్తు, పల్లాలు చూశా. ఎలాటి పరిస్థితుల్లోనైనా కొంత మంది స్నేహితులు మనతోనే ఉండిపోతారు.' అంటూ రాసుకొచ్చింది సమంత. ఈ పోస్ట్‌పై విజయ్ బదులిస్తూ 'సామ్ నా ఫేవరెట్ లేడీ' అని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథగా రూపొందుతోన్న ఖుషి మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబరు 1న థియేటర్లలోకి రానుంది.
(ఇది చదవండి: అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష)
Comments
Please login to add a commentAdd a comment