సీరియల్‌ నటి శ్రీవాణి ఇల్లు చూశారా? ఎంత బాగుందో.. | Serial Actress Sreevani Home Tour | Sakshi
Sakshi News home page

Sreevani: బుల్లితెర నటి శ్రీవాణి అందమైన ఇల్లు.. తలుపు లేకుండా పూజ గది..

Mar 29 2023 8:26 PM | Updated on Mar 29 2023 10:00 PM

Serial Actress Sreevani Home Tour - Sakshi

ఇంటికి ముందు గుడిసె ఆకారం వచ్చేలా డిజైన్‌ చేయించారు

బుల్లితెర నటి శ్రీవాణి హోమ్‌టూర్‌ వీడియో చేసింది. గతేడాది ఆమె సొంతింటి కల నిజం చేసుకున్న విషయం తెలిసిందే కదా! ఇటీవల ఈ ఇంటికే ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించి నూతన గృహంలా మార్చేసింది నటి. ఈ సందర్భంగా హోమ్‌టూర్‌ అంటూ యూట్యూబ్‌లో వీడియో రిలీజ్‌ చేసింది. ఈ వీడియోలో శ్రీవాణి, ఆమె భర్త విక్రమ్‌ మాట్లాడుతూ.. పల్లెటూరు అంటే ఎంతో ఇష్టమని, ఒక నెల రోజులపాటు ఏదైనా పల్లెలో ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాదు, పల్లెటూరు వాతావరణంపై ఉన్న ఇష్టంతో ఇంటికి ముందు గుడిసె ఆకారం వచ్చేలా డిజైన్‌ చేయించారు. ఇంటికి ముందు బోలెడన్ని మొక్కలు పెట్టి పచ్చదనాన్ని నింపేశారు. హాల్‌లో సోఫాలు, దేవుడి విగ్రహాలు ఉంచారు. దేవుడి గదిని సింపుల్‌గా డిజైన్‌ చేశారు. అయితే ఈ గదికి తలుపు లేకపోవడం గమనార్హం. విశాలమైన ఓపెన్‌ కిచెన్‌ను, డైనింగ్‌ హాల్‌ను క్షుణ్ణంగా తిరిగి చూపించారు. ప్రతి గదిలో రిమోట్‌తో ఆన్‌, ఆఫ్‌ చేయగలిగే ఫ్యాన్స్‌ పెట్టారు. ఇవి గాలినే కాకుండా వెలుతురిని కూడా ఇస్తాయని చూపించారు.

బాల్కనీని కూడా పూలకుండీలతో నింపేశారు. బాల్కనీలో ఉన్న పచ్చని మొక్కల మధ్య తమ కుటుంబం అంతా కాలక్షేపం చేస్తామని చెప్పుకొచ్చింది శ్రీవాణి. అనంతరం మాస్టర్‌ బెడ్‌రూమ్‌.. కూతురి బెడ్‌రూమ్‌, మరొక ఎక్స్‌ట్రా బెడ్‌రూమ్‌ చూపించారు. ప్రతి గదిలో వీలైనంత సామాను పెట్టుకోవడానికి ఎక్కువ కప్‌ బోర్డ్స్‌ చేయించామని తెలిపింది. ఇది చూసిన నెటిజన్లు మీ ఇల్లు చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement