మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురుంటారని అంటుంటారు, నిజమే మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు. అందులోనూ సెలబ్రిటీలను పోలిన వ్యక్తులు సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతుంటారు. ఇబ్రహీం ఖాద్రి ఈ కోవకే చెందాడు. అచ్చం బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌లా ఉండే ఇతడికి ఇంటా బయట ఫుల్ పాపులారిటీ. కానీ ఈ క్రేజ్ కొన్నిసార్లు తనకు తంటాలు కూడా తెచ్చిపెట్టిందంటున్నాడితడు. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో ముచ్చటించిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
'నేనసలు నా లుక్స్ కోసం పట్టించుకునేవాడినే కాదు. కానీ నా లుక్స్ చూసి నా ఇంట్లో వాళ్లు, ఫ్రెండ్స్ షారుక్ ఖాన్‌లా ఉన్నావని అంటుండేవారు. మా పేరెంట్స్ అయితే నేను బాద్‌షాలా ఉన్నందుకు గర్వపడేవారు. ఓసారి షారుక్ సినిమాకు వెళ్లినప్పుడు నేనే హీరోననుకుని అందరూ నన్ను చుట్టుముట్టి సెల్ఫీలు అడిగారు. మరోసారి క్రికెట్ మ్యాచ్ చూద్దామని స్టేడియంకు వెళ్లినప్పుడు జనాలు వెంటనే ఫోన్లు తీసి నా వైపు క్లిక్‌మనిపించడం ప్రారంభించారు.
నన్ను చూసి చప్పట్లు కొడుతూ డైలాగ్స్ చెప్తున్నారు. వారి ప్రేమను చూసి నేను మొదటిసారి బాద్‌షాలా ఫీలయ్యాను. కానీ ఆ వెంటనే జనాలు నా చుట్టూ చేరి ఫొటోల కోసం ఎగబడ్డారు. నన్ను టైట్‌గా పట్టుకుని లాగడంతో షర్ట్ చినిగిపోయింది. వెంటనే పోలీసులను పిలిస్తే వాళ్లు సురక్షితంగా నన్ను బయటకు తీసుకొచ్చారు. కానీ అప్పుడు కూడా షారుక్ సర్, ఒక్క సెల్ఫీ అని అడిగారు. ఇక అప్పటినుంచి హీరో మేనరిజమ్స్ కాపీ కొట్టడం ప్రారంభించా. కొన్ని పెళ్లిళ్లకు నన్ను స్పెషల్ గెస్ట్‌గా కూడా పిలుస్టుంటారు. ఏదేమైనా అసలైన షారుక్‌ను కలవడమే నా ఏకైక లక్ష్యం' అని చెప్తున్నాడు ఇబ్రహీం ఖాద్రి.
చదవండి: ఇట్స్ టూ మచ్, అంత మేకప్ అక్కర్లేదు.. నటిపై ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment