అంబానీ పెళ్లిలో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం.. వీడియో వైరల్‌ | Shanaya Kapoor Argue With Security Guards At Anant Ambani's Wedding | Sakshi
Sakshi News home page

అంబానీ పెళ్లిలో సెక్యూరిటీతో వాగ్వాదం.. 'సినిమాలు జీరో కానీ.. యాటిట్యూడ్‌ మాత్రం..!'

Published Mon, Jul 15 2024 2:14 PM | Last Updated on Mon, Jul 15 2024 3:04 PM

Shanaya Kapoor Argue With Security Guards At Anant Ambani's Wedding

అనంత్‌ అంబానీ - రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకలు చూస్తే కళ్లు జిగేల్‌మంటున్నాయి. నెలల తరబడి ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరపగా ఇప్పుడు పెళ్లి- ఆశీర్వాద్‌- రిసెప్షన్‌ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు సెలబ్రిటీలందరూ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

అయితే బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌ కూతురు షనాయా కపూర్‌ సెక్యూరిటీ గార్డుతో గొడవపడిన వీడియో సైతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ సెక్యూరిటీ సిబ్బంది షనాయా బ్యాగ్‌ చెక్‌‌ చేసేందుకు ప్రయత్నించగా ఆమె అసహనం వ్యక్తం చేసింది. అతడిపై ఫైర్‌ అయింది. ఇది చూసిన జనాలు ఆమెపై మండిపడుతున్నారు.

'ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఇంత యాటిట్యూడ్‌ చూపిస్తుందేంటి?', 'చేసిన సినిమాలు జీరో.. యాటిట్యూడ్‌ మాత్రం 100%', 'సెక్యూరిటీ సిబ్బంది వాళ్ల పని చేస్తున్నారు.. అందులో ఇబ్బందిపడాల్సిందేముందో..' అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా అంబానీ పెళ్లి వేడుకలకు హాజరైనవారిలో షనాయా కపూర్‌ కూడా ఉంది. జామ్‌ నగర్‌లోని ప్రీవెడ్డింగ్‌ వేడుకల నుంచి పెళ్లి-రిసెప్షన్‌ వరకు అన్నింటికీ హాజరైంది. కాగా ఈ బ్యూటీ 'బెదడక్‌' సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించి చాలాకాలమైంది. కానీ ఇంతవరకు ఆ మూవీ నుంచి మళ్లీ ఎటువంటి అప్‌డేట్‌ రాలేదు.

 

Shanaya going off
byu/Jealous_Summer_4867 inBollyBlindsNGossip

చదవండి: ఈ సినిమా సక్సెస్‌ కాకపోతే ఇండస్ట్రీ వదిలేసి పోదామనుకున్నా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement