యూట్యూబ్ వీడియోలతో బోలెడంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు సాఫ్ట్‌వేర్ డెవలపర్ షణ్ముఖ్ జశ్వంత్. బిగ్‌బాస్ షోతో మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యాడు. బిగ్‌బాస్ తర్వాత చాలాకాలంగా నటనకు దూరంగా ఉన్న ఈ యూట్యూబర్ తాజాగా ఏజెంట్ ఆనంద్ అనే వెబ్‌సిరీస్‌తో సినీప్రియులను పలకరించనున్నాడు. ఈ వెబ్‌సిరీస్ ఆహాలో ప్రసారం కానుంది.
ఈ సందర్భంగా షణ్ను సాక్షితో మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ కంటే ముందే ఈ సిరీస్ రెడీగా ఉంది. బిగ్‌బాస్ అయ్యాక చేద్దామనుకున్నాను. యూట్యూబ్‌లో చేద్దామనుకున్నాను, కానీ ఆహా నుంచి ఆఫర్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్‌లో మనసు తప్ప ఏదైనా వెతికి ఇచ్చేస్తాను అనే డైలాగ్ డైరెక్టర్ చెప్పమంటే చెప్పాను. అంతకుమించి నాకేం తెలీదు. బిగ్‌బాస్ ముందు యూట్యూబ్‌లో చేసేవాడిని, ఇప్పుడు ఓటీటీలో చేస్తున్నా.. అదే నాలో వచ్చిన మార్పు. ఇక డిప్రెషన్‌లో ఉన్న నేను హీరో సూర్యను కలవడంతో దాన్నుంచి బయటపడ్డా. నేను చేసిన సూర్య సిరీస్ తను చూశానని చెప్పడంతో చాలా ఆనందమేసింది' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: రెమ్యునరేషన్ నేను ఎక్కువ తీసుకోవడమేంటి?: కీర్తి సురేశ్
బాద్‌షా ఉన్నంతకాలం బాలీవుడ్ గతి ఇంతే: డైరెక్టర్‌పై ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment