ఏది ఏమైనా మా సినిమా రిలీజవుతుంది | Shukra Movie Will Be Released As Per The Schedule | Sakshi
Sakshi News home page

ఏది ఏమైనా మా సినిమా రిలీజవుతుంది

Published Wed, Apr 21 2021 10:52 AM | Last Updated on Wed, Apr 21 2021 11:00 AM

Shukra Movie Will Be Released As Per The Schedule - Sakshi

‘‘కరోనా నేపథ్యంలో థియేటర్లు మూసివేత అంటున్నారు. కానీ, ఏది ఏమైనా ‘శుక్ర’ సినిమాను విడుదల చేయడానికే నిర్ణయించుకున్నాం. మా చిత్రం విడుదలకు సహకరించిన ‘మధుర’ శ్రీధర్‌గారికి థ్యాంక్స్‌’’ అని దర్శకుడు సుకు పూర్వజ్‌ అన్నారు. అరవింద్‌ కృష్ణ, శ్రీజితా ఘోష్‌ జంటగా అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మించిన ‘శుక్ర’ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘వోట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌ మీట్‌’లో సుకు పూర్వజ్‌ మాట్లాడుతూ– ‘‘శుక్ర’ అంటే డైమండ్‌ అని మా సినిమాలో అర్థం చెబుతున్నాం. మా చిత్రం ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇంకో 10, 15 ఏళ్లు ఇండస్ట్రీలో దర్శకుడిగా ఉంటానన్న నమ్మకం ఉంది’’ అన్నారు.

తేజ్‌ పల్లె మాట్లాడుతూ– ‘‘మాకున్న బడ్జెట్‌కు ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్‌ వచ్చిందంటే సినిమాటోగ్రాఫర్‌ జగదీశ్‌ ప్రతిభే కారణం. సుకు పూర్వజ్‌ మంచి కమర్షియల్‌ డైరెక్టర్‌ అవుతాడు. అరవింద్‌ కృష్ణ వన్‌ మ్యాన్‌ షో లాగా ఈ సినిమా చేశాడు’’ అన్నారు. ‘‘మీకు మా సినిమా పాటలు, ట్రైలర్, విజువల్స్‌ నచ్చితే థియేటర్లకు రండి. మాస్క్‌ పెట్టుకుని, సామాజిక దూరం పాటిస్తూ సినిమా చూడండి’’ అన్నారు అరవింద్‌ కృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement