లాజిక్ లేని ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం 'సింగిల్ శంకరుం.. స్మార్ట్ ఫోన్ సిమ్రానుమ్' అని ఆ చిత్ర నిర్మాత కుమార్ తెలిపారు. ఈయన లార్క్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో మిర్చి శివ కథానాయకుడిగా నటించారు. నటి మేఘా ఆకాష్ అంజు కురియన్ నాయికలుగా నటించారు. మాకాపా, ఆనంద్, సారా, దివ్య, గణేష్ తదితరులు ముఖ్య పాత్ర పోషించినా ఇందులో గాయకుడు మనో ఓ ప్రధానపాత్రలో నటించడం విశేషం. చాలా కాలం తర్వాత ఈయన నటించిన చిత్రం ఇదే. ఈ చిత్రం ద్వారా విఘ్నేష్ షా.పిఎన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. దీన్ని 11:11 ప్రొడక్షన్స్ అధినేత ప్రభు తిలక్ విడుదల చేస్తున్నారు. కాగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేదికపై నిర్మాత కె.కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ప్యారిస్ జయరాజ్‌ను విడుదల చేసిన ప్రభు తిలక్ మళ్లీ ఈ చిత్రంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
ఆయన నిజ జీవితంలో డాక్టర్ కావడంతో తమ మానసిక వేదనను అర్థం చేసుకొని ఎలాంటి లాభనష్టాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అంగీకరించారని చెప్పారు. అదేవిధంగా కరోనా బారిన పడ్డప్పుడు నటుడు మిర్చి శివ తనను ఎంతగానో ఉత్సాహ పరిచి, ఆత్మస్థైర్యాన్ని నింపి అందులోంచి బయట పడేలా చేశారన్నారు. దర్శకుడు చెప్పిన కథ విని ఈ చిత్రంలో నటించడానికి ఆయన అంగీకరించారని చెప్పారు. నటి మేఘా ఆకాష్ చాలా బాగా నటించారని, గాయకుడు మనో కామెడీ పాత్రలో అందరినీ నవ్విస్తారని చెప్పారు. ఈ చిత్రంలో ఆయన మంచి గుర్తింపు వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment