Sobhita Dhulipala Reacts To Question About Naga Chaitanya And Samantha, Deets Inside - Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: సామ్‌ డీల్‌ చేసే విధానం బాగుంటుంది, చై చాలా సైలెంట్‌

Published Sat, Jun 24 2023 4:22 PM | Last Updated on Sat, Jun 24 2023 4:34 PM

Sobhita Dhulipala About Naga Chaitanya, Samantha Ruth Prabhu - Sakshi

నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరు చుట్టేసి వస్తుందంటారు. ఇక్కడ నిజం, అబద్ధం అన్నదాన్ని పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో మాత్రం పుకార్లు పుంఖానుపుంఖానులుగా వైరలవుతుంటాయి. ఇద్దరు కలిసి కనిపిస్తే స్నేహం అనడానికి బదులు ప్రేమ అనేస్తారు, కాస్త బొద్దుగా కనిపిస్తే చాలు గర్భిణి అనేస్తారు. సెలబ్రిటీ కపుల్స్‌ జంటగా కాకుండా సింగిల్‌గా ఫంక్షన్‌కు హాజరైతే విడాకులు తీసుకుంటున్నారేమో అనేస్తారు.

సోషల్‌ మీడియాలో అంతలా జడ్జ్‌ చేస్తున్నారు. మీరనుకునేది నిజం కాదురా బాబూ అని సెలబ్రిటీలు నెత్తీనోరూ మొత్తుకున్నా కళ్లతో కనిపించేదే నిజం అని వాదిస్తున్నారు నెటిజన్లు. కొన్నిసార్లు నెటిజన్ల అభిప్రాయమే నిజమైందనుకోండి. మొహమాటానికి ప్రేమ,గీమా లేదన్నా చివర్లో పెళ్లికి రెడీ అయిన జంటలు చాలానే ఉన్నాయి. ఇకపోతే గతకొంతకాలంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఇది కేవలం రూమర్‌ అని గతంలోనే కొట్టిపారేసిన శోభిత తాజాగా మాజీ దంపతులు నాగచైతన్య, సమంతల గురించి మాట్లాడింది. 'సమంత కెరీర్‌ జర్నీ చాలా కూల్‌గా అనిపిస్తుంది. ఒకసారి ఆమె చేసిన సినిమాలు చూసినట్లైతే తను ప్రాజెక్టులను డీల్‌ చేసే విధానం బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది. నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. 'అతడు చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎంతో ఒద్దికగా ఉంటాడు. అతడి స్వభావాన్ని మెచ్చుకుని తీరాల్సిందే!' అని పేర్కొంది. కాగా చైసామ్‌ 2021 అక్టోబర్‌లో విడిపోయిన సంగతి తెలిసిందే!

చదవండి: ప్రముఖ నటుడి సోదరి మృతి.. ఆమె మరణాన్ని తట్టుకోలేక అదే రోజు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement