Sobhita Dhulipala Opens Up On Her Initial Struggles In The Movie Industry - Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: అందంగా లేనని ముఖం మీదే అన్నారు, నన్ను రిజెక్ట్‌ చేశారు!

Published Fri, Jun 23 2023 6:40 PM | Last Updated on Fri, Jun 23 2023 7:03 PM

Sobhita Dhulipala: Was Told I am Not Fair and Pretty Enough - Sakshi

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ తెలుగులో తప్ప మిగతా భాషల్లో దూసుకుపోతోంది. రామన్‌ రాఘవ్‌ 2.0 అనే హిందీ సినిమాతో వెండితెరపై తన ప్రయాణాన్ని ఆరంభించిన ఈమె గూఢచారితో తెలుగు తెరపై వికసించింది. ఈ సినిమా హిట్‌ అయినప్పటికీ శోభిత మాత్రం అంతగా క్లిక్‌ అవ్వలేదు. ఈ సినిమా వచ్చిన నాలుగేళ్ల తర్వాత మేజర్‌ సినిమాతో తెలుగు తెరపై కనిపించిందీ బ్యూటీ. మధ్యలో హిందీ, మలయాళ చిత్రాలు చేసింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో మంకీ మ్యాన్‌ అనే సినిమా కూడా చేస్తోంది.

తాజాగా ఆమె తన కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న ఆటంకాలను గూర్చి చెప్పుకొచ్చింది. 'ఒక్కసారి గడప దాటి బయటకు వచ్చావంటే యుద్ధం చేయాల్సిందే! నాకు ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్‌ లేదు. నాకు ఇప్పటికీ గుర్తు.. వాణిజ్య ప్రకటనల ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు చాలాసార్లు అందంగా లేనని  ముఖం మీదే చెప్పి తిరస్కరించేవారు. నేను కూడా అద్దంలో నన్ను నేను చూసుకుని కాస్తంత అందంగా కూడా లేనని అనుకునేదాన్ని.

అయినప్పటికీ ఏదో ఒక కమర్షియల్‌ డైరెక్టకర్‌ మనల్ని వెతుక్కుంటూ వస్తాడని ఎప్పుడూ ఊహల్లో తేలిపోలేదు. నాకు తెలిసిందల్లా ఆడిషన్స్‌కు వెళ్లడం, 100% ఎఫర్ట్‌ పెట్టడం!' అని చెప్పుకొచ్చింది శోభిత. కాగా ఈ తెలుగందం చివరగా పొన్నియన్‌ సెల్వన్‌ 2 సినిమాలో నటించింది. మేడ్‌ ఇన్‌ హెవెన్‌ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్యే ద నైట్‌ మేనేజర్‌ అనే సిరీస్‌తో అలరించింది.

చదవండి: ప్రభాస్‌ సరికొత్త రికార్డ్‌.. ఏ సౌత్‌ హీరో వల్ల కాలేదు

నేను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ బాధితుడినే: నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement