సాక్షి, నల్లకుంట (హైదరాబాద్): కరోనా కష్టకాలం లో ప్రజలకు సాయం అందిస్తోన్న నటుడు సోనూసూద్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ కరోనా బాధితుడి ఇంటికి నేరుగా ఆక్సిజన్ యంత్రాన్ని పంపారు. నల్లకుంటకు చెందిన రాఘవ శర్మ(75) ఇటీవల కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. రాఘవ శర్మలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోగా సాయం చేయాలంటూ అతడి కొడు కు లక్ష్మినారాయణ ట్విట్టర్ ద్వారా సోనూ సూద్‌ను కోరారు. దీనికి స్పందించిన సోనూసూద్ తన చారిటీ ఫౌండేషన్ ద్వారా ఏకంగా ఆక్సిజన్ యంత్రాన్ని ఇంటికి పంపించాడు. గురువారం రాత్రి బతుకమ్మకుంట గోకుల్ స్వీట్ షాప్ ఎదురు వీధిలో ఉన్న వీరి నివాసానికి కొరియర్ ప్రతినిధి వెళ్లి వారికి ఆక్సిజన్ మిషన్ అందజేయడంతో రాఘవ కుటుంబ సభ్యులు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment