మెసేజ్‌ చూడకపోతే క్షమించండి : సోనూసూద్‌ | Sonu Sood Tweets About How He Is Getting Messgaes To Help From People | Sakshi
Sakshi News home page

మెసేజ్‌ చూడకపోతే క్షమించండి : సోనూసూద్‌

Published Thu, Aug 20 2020 11:17 AM | Last Updated on Thu, Aug 20 2020 1:37 PM

Sonu Sood Tweets About How He Is Getting Messgaes To Help From People - Sakshi

ముంబై : కరోనా కష్టకాలంలో పేదలకు సహాయం చేస్తూ ప్రముఖ నటుడు సోనూసూద్‌ నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమందికి తనకు తోచినంత సాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాజాగా దేశవ్యాప్తంగా సాయం చేయాలంటూ మెయిల్స్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా ద్వారా గురువారం తనకు వచ్చిన వినతులను సోనూ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసుకున్నాడు. అందులో 1137 మెయిల్స్‌, 19వేలు ఫేస్‌బుక్‌ మెసేజ్‌లు, 4812 ఇన్‌స్టా, మరో 6741 మెసేజ్‌లు ట్విటర్‌ ద్వారా వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. ' నాకు సహాయం చేయాలంటూ రోజూ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న మెసెజ్‌లు. అందరి కష్టాలు తెలుసుకొని వారికి సహాయం చేయడం కొంచెం కష్టమే.. కానీ నా శక్తి మేరకు ప్రయత్నిస్తా.. ఎవరివైనా మెసెజ్‌లు చూడకపోతే దయచేసి క్షమించండి 'అంటూ ట్వీట్‌ చేశారు.(చదవండి : సోనూ సూద్‌ సేవ: ఈసారి కొత్త దేశం.. కొత్త మిషన్)‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement