
SS Rajamouli Meets Salaman Khna In Mumbai: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి బాలీవుడ్ ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్‌ను కలిశాడు. ప్రస్తుతం ఇది టాలీవుడ్, బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ముంబైలోని ఫిలింసిటీలో తన కుమారుడు కార్తికేయతో కలిసి రాజమౌళి సల్మాన్‌ను కలిసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరూ ఎందుకు కలిశారు? వీరి మీటింగ్ వెనుక ఉన్న అసలు కారణమేంటనే విషయాలపై విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. అయితే పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకను జక్కన్న ముంబైలో నిర్వహిస్తున్నాడట.
చదవండి: రూ. 40 కోట్ల సెట్‌లో రామ్ చరణ్-కియారాల రొమాంటిక్ సీన్స్!
ఈ వేడుకకు సల్మాన్ ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించాడని కొందరూ అంటుంటే, మరికొందరు కథ విషయంలో చర్చలు జరిపారని మాట్లాడుకుంటున్నారు. అయితే రామ్ చరణ్, సల్మాన్ ఖాన్‌కు మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. చెర్రి నటించిన ‘తుపాన్’ చిత్రాన్ని హిందీ సల్లూభాయ్ ప్రమోట్ చేశాడు. అయితే చరణ్ బదులు రాజమౌళి వెళ్లి ఆహ్వానిస్తేనే మర్యాదగా ఉంటుందని, అందుకే ఈ మీటింగ్ జరిగిందని సినీ వర్గాల నుంచి సమాచారం. అంతేగాక ఈ బాలీవుడ్ కండలవీరుడితో జక్కన్న ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడమోనని, అదే విషయంపై కలిసి చర్చించినట్లు కొందరూ ఊహాగానాలే రేకిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటన్నది మాత్రం స్పష్టత లేదు. మరి దీనిపై రాజమౌళి టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.
చదవండి: ఆ నటుడితో పీకల్లోతు ప్రేమలో బిగ్‌బి మనవరాలు!
Comments
Please login to add a commentAdd a comment