రైటింగ్‌ పూర్తి చేశాం | SS Rajamouli Shares An Update On Mahesh Babu SSMB29 During Screening Of RRR In Japan, Deets Inside - Sakshi
Sakshi News home page

SSMB29 Movie Update: రైటింగ్‌ పూర్తి చేశాం

Published Wed, Mar 20 2024 12:06 AM

SS Rajamouli Shares An Update On Mahesh Babu SSMB 29 During Screening Of RRR In Japan - Sakshi

రాజమౌళి

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా (‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్‌ నారాయణ ఈ సినిమా నిర్మాత. కాగా ‘రౌద్రం.. రణం.. రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్‌) స్క్రీనింగ్‌లో భాగంగా రాజమౌళి జపాన్‌ వెళ్లారు. అక్కడ మహేశ్‌బాబుతో తాను చేయనున్న మూవీ గురించి మాట్లాడారు రాజమౌళి. ‘‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ మూవీకి సంబంధించిన రైటింగ్‌ పూర్తి చేశాం. ప్రీ విజువలైజేషన్‌ చేస్తూ, ప్రీ ప్రోడక్షన్‌ ప్రాసెస్‌లో ఉన్నాం. నటీనటుల పరంగా ఇప్పట వరకు మహేశ్‌బాబు ఒక్కరే ఖరారయ్యారు. మీలో (జపాన్‌ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ..) చాలా మందికి మహేశ్‌ తెలుసు.. హ్యాండ్‌సమ్‌గా ఉంటాడు. త్వరగా ఈ సినిమాను పూర్తి చేస్తామనే అనుకుంటున్నాం.

‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ విడుదల సమయంలో మహేశ్‌బాబును నేను ఇక్కడికి (జపాన్‌) తీసుకుని వస్తాను. మరింత మందికి పరిచయం చేస్తాను’’ అన్నారు రాజమౌళి. విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించిన ఈ సినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం 2022 మార్చి 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 21 అక్టోబరు 2022న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను జపాన్‌లో విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement