
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రియాలిటీ షో నుంచి ఇప్పటి వరకు ఐదు వారాలు పూర్తి కాగా.. వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం విశేషం. ఐదోవారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించినప్పటికీ చివరికీ శుభ శ్రీ రాయగురు హోస్‌కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. మరో కంటెస్టెంట్ గౌతమ్‌ను మాత్రం సీక్రెట్ రూమ్‌లోకి పంపించేశారు బిగ్ బాస్. అయితే ఇప్పటికీ ఐదుగురు హౌస్ నుంచి బయటికి రాగా.. కొత్తగా మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అంబటి అర్జున్, పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయని పావని, భోలే షావలి ఉన్నారు.
(ఇది చదవండి: బిగ్‌బాస్‌లో ఎంట్రీ.. అప్పుడే రెండు చిత్రాలకు ఓకే!)
అయితే ఐదోవారంలో ఎలిమినేట్ అయిన శుభ శ్రీ రాయగురు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. హౌస్‌లో తన అందం, అభినయంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న శుభశ్రీ హౌస్ నుంచి బయటకొచ్చింది. ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా శుభశ్రీకి తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే రెమ్యునరేషన్ విషయానికొస్తే వారానికి దాదాపు రూ.2 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు వారాల్లో దాదాపు రూ.10 లక్షలు సంపాదించి ఉంటుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment