తమిళ సినీ రంగం నుంచి మరో అగ్రనటుడు పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారే తరుణం ఆసన్నమైంది. విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి మహానాడు నేడు (అక్టోబర్ 27) జరగనుంది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే, ఒకరోజు ముందుగానే నేతలందరూ విల్లుపురానికి చేరుకున్నారు. కాగా మహానాడులో విజయ్ ఏఏ అంశాలను ప్రస్తావిస్తారు.. ఎవరిని టార్గెట్ చేస్తారు.. సిద్ధాంతాలు ఏరకంగా ఉంటాయనే విషయం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సభ హైలెట్స్ ఇవే..
5 నుంచి 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా .
వేదికపై విజయ్ ఎగుర వేసే పార్టీ జెండా ఐదేళ్ల పాటు ఎగిరే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
చైన్నె – తిరుచ్చి జాతీయ రహదారిలోని వీసాలై వద్ద 85 ఎకరాల విస్తీర్ణంలో సినీ సెట్టింగ్‌లను మించి మహానాడు ఏర్పాట్లు.
సభా వేదిక చుట్టూ.. వేలునాచ్చియార్, కామరాజర్, పెరియార్, అంబేడ్కర్, తమిళ తల్లి, చోళ, చేర, పాండ్య రాజుల కటౌట్లను ఏర్పాటు చేయడం.
సభా ప్రాంగణంలో విజయ్ అభిమానులకు సమీపంలోకి వచ్చి పలకరించే విధంగా 800 మీటర్లకు ప్రత్యేకంగా ర్యాంప్ ఏర్పాటు.
వాహనాల పార్కింగ్ కోసం 207 ఎకరాల స్థలం కేటాయింపు.
చైన్నె నుంచి విక్రవాండి వరకు సుమారు 150 కి.మీ దూరంలో విజయ్ కటౌట్లు, పార్టీ జెండాలను తమిళగ వెట్రికళగం వర్గాలు ఏర్పాటు చేశాయి.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అభిమానులు, పార్టీ కేడర్ చేరుకునే విధంగా ప్లాన్.. సాయంత్రం 5 గంటలకు మహానాడు మొదలయ్యే రీతిలో షెడ్యూల్ సిద్ధం.
మహానాడు భద్రత విధులలో ఇద్దరు డీఐజీలు, 10 మంది ఎస్పీలు, 15 మంది ఏడీఎస్పీలు, 50 మంది డీఎస్పీలు సహా 6 వేల మంది పోలీసులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment