Actress Tamannah Home Tour Video - Sakshi
Sakshi News home page

తమన్నా ఇల్లు చూశారా..?, దాని కోసం ఎన్ని కోట్లు వెచ్చించిందో!

Published Sun, Mar 21 2021 4:23 PM | Last Updated on Sun, Mar 21 2021 6:07 PM

Tollywood Actress Tamannaah Bhatia Home Tour Video - Sakshi

సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీలో ఒకటి రెండేళ్ల నిలదొక్కుకోవడమే కష్టం. చాలా తక్కువ మంది నటీమణులు మాత్రమే చిత్రపరిశ్రమలో పదేళ్లకు పైగా రాణిస్తున్నారు. అలాంటి అతి కొద్ది మందిలో తమన్నా ఒకరు. ఈ మిల్కీ బ్యూటీ 16 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది.  ఇప్పటికీ ఈమె కోసం నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 50పైగా చిత్రాల్లో నటించిన తమన్నా.. ఆస్తులను బాగానే కూడబెట్టింది. ముంబైలో అద్భుతమైన ఇంటిని నిర్మించుకుంది. తాజాగా తన ఇంటికి సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే తమన్నా ఏం చేసిన ఓ ‘లెక్క’ ఉంటుంది. ఫ్రీగా ఎవరైన ఇంటిని చూపిస్తారు.. కానీ నేను మాత్రం అలా కాదన్నట్లుగా.. ప్రమోషన్‌లో భాగంగానే తన ఇంటి వివరాలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఓ ప్రముఖ పెయింటింగ్స్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో తన ఇంటిని పరిచయం చేస్తూ.. తను లేకపోయినా తన తండ్రి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని.. ఇల్లు నిర్మాణం కూడా అన్నీ నాన్న చూసుకున్నాడని చెప్పుకొచ్చింది తమన్నా. 

‘సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇంటీరియర్‌ డిజైన్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని నాన్నే దగ్గరుండి చూసుకున్నారు. సినిమా షూటింగ్స్‌, ఇతర పనుల రీత్యా నేను ఇంట్లో చాలా తక్కువ సమయాన్ని గడుపుతుంటాను. అయితే ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ నివాసం నాకు ప్రతిరోజూ కొత్తగానే ఉంటుంది’అని తమన్నా వివరించింది. అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన  పెంపుడు కుక్కను కూడా పరిచయం చేసింది. తమన్నా ప్రసుత్తం అనిల్ రావిపూడి ఎఫ్ 3తో పాటు సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాలతో బిజీగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement