TV Actress Ashmita Buys Mercedes Benz Car - Sakshi
Sakshi News home page

Ashmita: బెంజ్‌ కారు కొన్న బుల్లితెర నటి.. ధర ఎంతంటే?

Published Sun, May 7 2023 2:35 PM | Last Updated on Sun, May 7 2023 3:17 PM

TV Actress Ashmita Buys Mercedes Benz Car - Sakshi

అటు సీరియల్స్‌, ఇటు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నటి అస్మిత. సీరియల్స్‌తో బిజీగా ఉన్న సమయంలో యూట్యూబ్‌లో యష్‌ ట్రిక్స్‌ పేరిట ఛానల్‌ ఓపెన్‌ చేసింది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఈ ఛానల్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది నటి. హోం టూర్‌, ట్రావెలింగ్‌ వ్లాగ్‌, లొకేషన్‌లో చేసే అల్లరి, షాపింగ్‌ వ్లాగ్‌.. ఇలా అన్నింటినీ యూట్యూబ్‌లో షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతోంది.

సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న అస్మిత తాజాగా మెర్సిడిస్‌ బెంజ్‌ కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ సంతోషం వ్యక్తం చేసింది. 'ఈ అందమైన కారును నిన్న ఇంటికి తీసుకొచ్చేశాం. ఆనందంతో నా మనసు ఉప్పొంగుతోంది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరి ముఖాల్లోనూ సంతోషం కనిపించింది' అంటూ కొత్త కారు ముందు దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. ఈ కారు ధర అర కోటి పైనే ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త కారు కొన్న అస్మితకు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు.

కాగా అస్మితది మార్వాడీల కుటుంబం. ఆమె కలకత్తాలో జన్మించింది. తన చిన్నతనంలో కుటుంబం హైదరాబాద్‌ వచ్చి సెటిలైపోయింది. చిన్నప్పటి నుంచి అస్మితకు మోడలింగ్‌ అంటే పిచ్చి. కానీ ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. యాడ్‌ ఛాన్స్‌ వస్తే నో చెప్పారు. అయినా సరే వదలకుండా స్థానికంగా జరిగిన మోడలింగ్‌ పోటీలో అస్మిత పాల్గొని గెలిచింది. అప్పుడు ఇంట్లోవాళ్లకు నమ్మకం కలగడంతో ఓకే అన్నారు. అలా యాడ్స్‌లో బిజీ అయిన సమయంలో సీరియల్‌లో నటించే ఛాన్స్‌ వచ్చింది. బుల్లితెరపై సీరియల్స్‌ చేస్తున్న సమయంలో మురారి, లవ్‌ టుడే, అప్పుడప్పుడు, అతిథి.. ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. అప్పట్లో హీరోయిన్‌గా చేసే ఛాన్స్‌ వచ్చినా ఇంట్రస్ట్‌ లేక వదిలేశానని గతంలో చెప్పింది అస్మిత.

చదవండి: మాళవిక బోల్డ్‌ కామెంట్స్‌.. సిగ్గుతో మెలికలు తిరిగిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement