TV Actress Hiba Nawab Opens Up About Her Relationship And Marriage, Deets Inside - Sakshi
Sakshi News home page

Hiba Nawab: ఇకపై తాను సింగిల్‌ కాదు కమిటెడ్‌ అంటోన్న బుల్లితెర నటి

Published Fri, Apr 22 2022 12:24 PM | Last Updated on Fri, Apr 22 2022 12:45 PM

TV Actress Hiba Nawab Opens Up About Her Relationship And Marriage, Deets Inside - Sakshi

ఫ్రెండ్స్‌ అందరూ బాయ్‌ఫ్రెండ్స్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే తెగ బాధపడిపోయింది హిందీ సీరియల్‌ నటి హిబా నవాబ్‌. తనక్కూడా ఓ ప్రియుడు ఉంటే బాగుండనుకుంది. అందుకని డేటింగ్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసింది. కానీ అందులో సరైనవాడిని వెతికే క్రమంలో తింగరివేషాలు వేసేవాళ్లు ఎక్కువగా కనిపించడంతో ఆ యాప్స్‌ అన్నీ డిలీట్‌ చేసింది. ఎట్టకేలకు ఈ మధ్యే తనకు కావాల్సినవాడు దొరకడంతో ప్రియుడు దొరికేశాడోచ్‌ అంటూ సంతోషంలో మునిగి తేలుతోందీ బుల్లితెర నటి.

'ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా? అని నేను తెగ ఎదురుచూస్తున్నాను. ఈ విషయం గురించి నా తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను. చాలామటుకు అందరు పేరెంట్స్‌ పెళ్లి విషయంలో తొందరపెడతారు, కానీ మా నాన్న మాత్రం పెళ్లికెందుకు తొందర అంటున్నారు. 30 ఏళ్లు వచ్చేవరకు కెరీర్‌ మీద ఫోకస్‌ పెట్టి, అనుకున్నది సాధించి ఆ తర్వాత వివాహం చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయని ఆయన అభిప్రాయం. లైఫ్‌లో సెటిల్‌ అవడానికంటే ముందు అనుకున్నది సాధించాలని ఆయన ఉద్దేశం.

ఆ మధ్య నాకు, పెరల్‌ వీ పూరీకి లింక్‌ పెడుతూ వార్తలు వచ్చాయి. మేమిద్దరం రోజులో 20 గంటలు కలిసి పని చేసిన సందర్భాలున్నాయి. అలా ఇద్దరం క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా మారాము. అంతకుమించి మామధ్య ఏమీ లేదు. పైగా నాకు నటుడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు. నేను చాలా పొజెసివ్‌. నన్ను పెళ్లాడే వ్యక్తి వేరొక నటితో ఆన్‌స్క్రీన్‌ మీద రొమాన్స్‌ చేస్తే నేను భరించలేను. అలాంటిది యాక్టర్‌ని పెళ్లాడి అతడు ఇంకొకరితో క్లోజ్‌గా ఉండకూడదు అంటే అది జరగని పని.

కొన్ని నెలల క్రితం మా ఫ్రెండ్స్‌ అందరూ రిలేషన్‌షిప్‌లో ఉంటే నేనొక్కదాన్నే సింగిల్‌గా ఉన్నాను. డేటింగ్‌ యాప్స్‌ ట్రై చేశా. కానీ చిత్రవిచిత్ర మనుషులను చూశాక ఆ యాప్స్‌ డిలీట్‌ చేశాను. మొత్తానికి నేను ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కలిశాను. అతడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి మాత్రం కాదు. సరైన సమయం వచ్చినప్పుడు అతడి గురించి, పెళ్లి గురించి అన్ని వివరాలు వెల్లడిస్తాను. అప్పటివరకు నా రిలేషన్‌ ఇంకా వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌లో ఉందని రాసుకోండి' అని చెప్పుకొచ్చింది నవాబ్‌.

చదవండి: హీరోతో డేటింగ్‌, కామెంట్‌ డిలీట్‌ చేసిన బిగ్‌బీ మనవరాలు

ఓటీటీలో అమితాబ్‌ బచ్చన్‌ లేటెస్ట్‌ మూవీ, ఎక్కడో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement