ఉగాది ఫీస్ట్‌ ఇచ్చిన బీస్ట్‌, ఆకట్టుకుంటున్న ట్రైలర్‌ | Ugadi 2022: Vijay, Pooja Hegde Beast Movie Trailer Release On April 2 | Sakshi
Sakshi News home page

Vijay Beast: ఆకట్టుకుంటున్న బీస్ట్‌ ట్రైలర్, వావ్‌ అనిపించేలా యాక్షన్‌ సీన్స్‌

Published Sat, Apr 2 2022 6:51 PM | Last Updated on Mon, Apr 4 2022 5:43 PM

Ugadi 2022: Vijay, Pooja Hegde Beast Movie Trailer Release On April 2 - Sakshi

Vijay Beast Trailer Launched : కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌, టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్‌'. ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రబృందం. డాక్టర్‌ ఫేం నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజా అప్‌డేట్‌ వచ్చేసింది. ఉగాది రోజు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఏప్రిల్‌ 2(ఉగాది) కొద్ది సేపటి క్రితం ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. 

చదవండి: సర్కారు వారి పాట.. మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్‌డేట్‌..

కాగా సౌత్‌ ప్రేక్షకులు ఎప్పటి నుంచో బీస్ట్‌ ట్రైలర్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో మేకర్స్‌ నేడు విడుదల చేశారు. దీంతో ట్రైలర్‌ విడులైన కొద్ది క్షణాల్లోనే వేలల్లో వ్యూస్‌ రాబట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్‌ 13న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే.. యాక్షన్‌ సీన్స్‌ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్‌ సిగ్నల్‌

‘రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని’ అనే డైలాగ్‌ ఈళలు వేయించాలే ఉంది. ఇక ఇందులో విజయ్‌ లుక్‌, ఫైట్‌ సీన్స్‌ మరో లెవల్‌లో ఉన్నాయి. 2.56 నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్‌ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. చెప్పాలంటే ఈ ఉగాది సందర్భంగా విజయ్‌ ఫ్యాన్స్‌కు బీస్ట్‌ ట్రైలర్‌ మంచి ఫీస్ట్‌ ఇచ్చేలా కనిపిస్తుంది. కాగా యంగ్‌ మ్యూజిక్‌ సన్సెషన్‌ అనిరుద్‌ రవిచంద్రన్‌ స్వరాలను అందిస్తున్న ఈ మూవీలోని పాటలకు వీపరితమైన రెస్పాన్స్‌ వస్తుంది. ఇటీవల విడుదలైన అరబిక్‌ కుత్తు పాట సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement