![Varun Tej Konidela Birthday:Interesting Facts About Fida Actor - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/19/varun%20tej.jpg.webp?itok=d3jSe2BM)
Varun Tej Konidela Birthday Special Story: రాశి కన్నా వాసి మిన్న అన్న మాటకు చక్కగా సూటయ్యే నటుడు వరుణ్ తేజ్ కొణిదెల. చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఆరడుగుల అందగాడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. పదేళ్లకే బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన వరుణ్ తేజ్ కంచె, ఫిదా లాంటి సినిమాలతో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. జనవరి 19 వరుణ్ తేజ్ బర్త్‌డే.. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ గురించి...
నటుడు, నిర్మాత నాగేంద్రబాబు, పద్మజల కుమారుడు వరుణ్ తేజ్. పదేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘హ్యాండ్స్ అప్’ సినిమాతో బాలనటుడిగా అరంగేట్రం చేశాడు. ఇక ఆ తరువాత 2000 నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించడం ప్రారంభించాడు. విభిన్నమైన పాత్రలతో అటు కమర్షియల్ సక్సెస్‌ను, ఇటు ఫ్యాన్స్ అభిమానాన్ని అందుకున్నాడు. సుమారు ఆరడుగుల నాలుగు అంగుళాల పొడవుండే వరుణ్ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ వారసత్వాన్ని అందుకుని రాణిస్తున్నాడు. ఫ్యాన్స్ ఈ మెగా వారసుడిని మెగా ప్రిన్స్ అని అభిమానంగా పిలుచుకుంటారు. హైట్‌కు తగ్గ శరీర సౌష్టవంతో యూత్‌ను ఆకట్టుకోవడమే కాదు అమ్మాయిల కలల రాకుమారుడు కూడా.
ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 , గద్దల కొండ గణేష్ లాంటి సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా. 2015లో విడుదలైన కంచె మూవీలో వరుణ్ నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. మరి రానున్న రోజుల్లో వరుణ్ మరిన్ని బ్లాక్ బ్లస్టర్స్ అందించాలంటూ అభిమానులు వరుణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. కాగా మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలుగా రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ , వైష్ణవ్ తేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్ సోదరి నిహారిక నటిగా, ప్రొడ్యూసర్‌గానూ, ఇటు బుల్లితెరపైనా రాణిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment