ప్రేమపక్షులు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు సహా టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇప్పటికే కాక్టైల్, మెహందీ, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే!
బుధవారం రాత్రి వధూవరులిద్దరూ ఒకరి తలపై మరొకరు జీలకర్ర-బెల్లం పెట్టారు. అనంతరం వరుణ్.. లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి అనంతరం కొత్త జంట నమస్కరిస్తున్న ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన అభిమానులు వరుణ్-లావణ్యల జంట చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఈ పెళ్లిలో రామ్‌చరణ్, అల్లు అర్జున్, నితిన్ తదితర సెలబ్రిటీ కపుల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక ఉపసాన పెళ్లి విందు కోసం సిద్ధమయ్యామంటూ ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో అతిథులకు విందు ఏర్పాట్లు ఎంత ఘనంగా చేశారో కనిపిస్తోంది.
ప్రేమ అలా మొదలైంది..
వరుణ్ తేజ్, లావణ్య వీరిద్దరూ మిస్టర్ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ 2017లో రిలీజైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం మొదలైంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటలీలో జరుపుకుంది. అక్కడ వీరి ప్రేమకు బీజం పడింది. తర్వాత అంతరిక్షంలోనూ వీరు కలిసి నటించారు. ఈ సినిమాతో మరింత దగ్గరయ్యారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.
👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Exciting moments await as the most beautiful and adorable pair, #VarunLav ❤️, ties the knot in Italy! The magical ceremony is set to begin at 7:18 PM. Stay tuned for updates and join us in celebrating the love of @IAmVarunTej and @Itslavanya. 💫 #VarunTej #LavanyaTripathi pic.twitter.com/V4VJ7ioCik
— 𝐒𝐡𝐢𝐯𝐚𝐚 (@IamShivaMegaFan) November 1, 2023
చదవండి: గౌతమ్ మాస్టర్ మైండ్.. రైతుబిడ్డ అవుట్.. ఏడ్చేసిన ప్రశాంత్
Comments
Please login to add a commentAdd a comment