పెళ్లైన పది రోజులకేనా.. కత్రినా ఎక్కడ? | Vicky Kaushal Shares Instagram Pic Resume Shooting After Marriage | Sakshi
Sakshi News home page

Vicky Kaushal: పెళ్లైన పది రోజులకే.. ఏంది భయ్యా? విక్కీ కౌశల్‌కు నెటిజన్ల ప్రశ్నలు

Published Sat, Dec 18 2021 6:06 PM | Last Updated on Sat, Dec 18 2021 7:15 PM

Vicky Kaushal Shares Instagram Pic Resume Shooting After Marriage - Sakshi

బాలీవుడ్‌కి సంబంధించి గత కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అంటే విక్కీ కౌశ‌ల్, క‌త్రినా కైఫ్ వివాహం. పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్‌షిప్‌ను గోప్యంగా ఉంచిన వీరిద్దరు ఎట్టకేలకు ఈ పెళ్లితో ఇటీవలే ఒక్కటయ్యారు. డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో కొద్ది మంది సన్నిహితుల మధ్య డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. 

పెళ్లి హంగామ అయ్యాక ఈ క్యూట్‌ కపుల్‌ ముంబైకి రావడంతో పాటు మీడియా ముందుకు కూడా వచ్చింది. అయితే వీరి వివాహం జరిగి వారం అయ్యిందో లేదో అప్పుడే కొత్త పెళ్లికొడుకు విక్కీ కౌశ‌ల్ వెడ్డింగ్‌ మూడ్‌కి ప్యాకెప్‌ చెప్పి షూటింగ్‌కు పయనమయ్యాడు. కాగా ఈ విషయాన్ని చెబుతూ విక్కీ త‌న ఇన్‌స్టాలో ఓ ఫోటో షేర్ చేశాడు. దానికి క్యాప్షన్‌గా.. ముందు టీ.. ఆ త‌ర్వాత షూటింగ్ అని పెట్టాడు.

ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పోస్ట్‌ చూసిన నెటిజన్లు విక్కీ పై ‍ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వివాహం జరిగిన వారానికే షూటింగ్‌కు బిజీనా.. మ‌రి క‌త్రినా ఎక్కడ? క‌త్రినా కైఫ్‌తో ఓ ఫోటో దిగి సోష‌ల్ మీడియాలో పెట్టు.. అని ఒకరు కామెంట్‌ చేయగా, పెళ్లై పది రోజులు కూడా కాలేదు అప్పుడే షూటింగా? హ‌నీమూన్ ప్లాన్ చేయ‌లేదా అని మరొకరు, హల్వా ఎలా ఉందని, మరీ ఇంత వర్క్‌ డెడికేషన్‌ ఏంటని  మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.

చదవండి: Vicky Kaushal: కత్రినా వంటపై కామెంట్‌ చేసిన భర్త విక్కీ కౌశల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement