దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార – దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్నారనే సంగతి చాన్నాళ్లుగా వినిపిస్తోంది. కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు ఇద్దరూ విహార యాత్రలకు వెళుతుంటారు. నయన–విఘ్నేశ్ సహజీవనం చేస్తున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఈ ఏడాది ఆఖరులో పెళ్లి చేసుకోబోతున్నారన్నది తాజా టాక్. వీటిపై విఘ్నేశ్ శివన్ స్పందిస్తూ – ‘‘ప్రస్తుతం నేను, నయన ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నాం. కెరీర్‌పరంగా మేం సాధించాల్సింది చాలా ఉంది. డేటింగ్ లైఫ్‌పై మాకు బోర్ కొట్టినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తాం’’ అన్నారు. కాగా విజయ్ సేతుపతి, నయనతార, సమంత ముఖ్య పాత్రల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కోవిడ్ వ్యాప్తి కాస్త తగ్గు ముఖం పట్టాక ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళతారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment