
అన్నీ ప్రేమకథలే చేస్తే కిక్కేముంటుందని యాక్షన్ మోడ్ ట్రై చేశాడు విజయ్ దేవరకొండ. కానీ అది వర్కవుట్ కాకపోవడంతో తిరిగి లవ్ ట్రాక్ ఎక్కాడు. అటు శాకుంతలంతో ఫ్లాప్ మూటగట్టుకున్న సమంత కూడా లవ్ ట్రాక్‌నే నమ్ముకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఖుషి. ప్రేమకథలకు పెట్టింది పేరైన దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'బేగంకు కవా చాయ్ అలవాటు అయినట్టు ఫ్యూచర్‌లో నేను కూడా అలవాటైపోతరా?' అని ఊహల్లో తేలిపోతుంటాడు విజయ్.
అప్పటివరకు ముస్లింగా కనిపించిన సామ్ సడన్‌గా తను బ్రాహ్మణురాలన్న నిజం చెప్తుంది. కానీ వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు చూపించారు. ఆ తర్వాత అసలు సమస్యలు మొదలయ్యాయి. అప్పటిదాకా వారి మధ్య ప్రేమ మాత్రమే కనిపించగా తర్వాత కోపం, గొడవలు అన్నీ మొదలవుతాయి. వీటన్నింటినీ డైరెక్టర్ అందంగా చూపించాడు. 'పెళ్లంటేనే సావురా.. నువ్వెప్పుడో సచ్చిపోయినవ్.. డెడ్ మీట్ రిప్..', 'భర్త అంటే ఎట్లుండాలో సమాజానికి చూపిస్తా', 'మార్కెట్లో నా గురించి అట్ల అనుకుంటున్నరు కానీ, నేను స్త్రీ పక్షపాతిని' అంటూ వచ్చే డైలాగులు బాగున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు బాగా క్లిక్ అయ్యాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుంది. ఖుషి సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment