
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ 'నా రోజా నువ్వే..' సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విజయ్, సమంతల కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇకపోతే లవ్ స్టోరీ, ఎమోషనల్ స్టోరీని తీయడంలో శివ నిర్వాణ మార్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోసారి శివ నిర్వాణ తన మ్యాజిక్ చూపించేందుకు రెడీగా ఉన్నాడు.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వదిలారు. ఖుషి చిత్రం నుంచి ఆరాధ్య అనే సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో సమంత, విజయ్ ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ప్రోమోను సోమవారం(జూలై 10), ఫుల్ సాంగ్‌ను బుధవారం(జూలై 12) విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 'నా రోజా నువ్వే' అనే పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్ 'ఆరాధ్య'తో మరోసారి 'ఖుషి' సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న సినిమాను విడుదల చేయబోతోన్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ కానుంది.
Giving you another melodious number to listen on loop ❤️🔥#Kushi Second Single #Aradhya on 12th July ❤️
— Mythri Movie Makers (@MythriOfficial) July 8, 2023
Song promo out on 10th July 💥
Telugu
🎤 @sidsriram @Chinmayi
✍️ @ShivaNirvana
Hindi
🎤 @JubinNautiyal @palakmuchhal3
✍️ @raqueebalam
Tamil
🎤 @sidsriram @Chinmayi
✍️… pic.twitter.com/yXOEqZfNV6
చదవండి: ఎవరినైనా బాధపెట్టి ఉంటే సారీ
Comments
Please login to add a commentAdd a comment