సౌత్ ఇండియాలో టాప్ హీరోల లిస్ట్‌లో విజయ్ పేరు ఉంటుంది. గతేడాది 'లియో'తో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ ప్రస్తుతం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆయన అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే, హీరో విజయ్ సోదరి విద్య ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆయన అభిమానులు కూడా కోలీవుడ్‌లో గత ఐదు రోజులుగా తెగ షేర్ చేస్తున్నారు.
తెలుగులోనూ విజయ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీకి చెందినవారే. తండ్రి ప్రముఖ డైరెక్టర్ ఎస్‌ఏ చంద్రశేఖర్ కాగా తల్లి శోభ గాయనిగా, రచయిత్రిగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే, విజయ్‌కి ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరు 'విద్య'. ఆమె మరణించి ఇప్పటికి సరిగ్గా 40ఏళ్లు అవుతుంది. దీంతో విజయ్ అభిమానులు విద్య సమాధి ఫోటోను నెట్టింట షేర్ చేస్తున్నారు.
1980లో జన్మించిన విద్య 1984 మే 20న ఆనారోగ్యంతో చిన్న వయసులోనే మరణించింది. ఆ సమయంలో వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. అలా నాలుగేళ్ల వయసులోనే విద్య చనిపోయింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడని తెలిపింది. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.
ఓ కార్యక్రమంలో విద్య గురించి మాట్లాడిన విజయ్.. 'నా జీవితంలో పెద్ద ప్రభావం మా చెల్లెలు విద్యా మరణం.. దాన్నుంచి కోలుకోవడం చాలా కష్టమైంది.. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఆమెను దూరం చేసిన దేవుడు.. నాకు చాలామంది చెల్లెలను అభిమానుల రూపంలో తిరిగిచ్చాడు. వారందరిలో నా చెల్లెలు రూపాన్ని ఇప్పటికీ చూసుకుంటాను.' అని చెప్పడం గమనార్హం. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు. ఆ పాప ఇప్పుడు బ్యాడ్మింటన్‌లో రాణిస్తోంది.
చెల్లెలుపై అంతప్రేమను చూపించే తమ అభిమాన హీరో కోసం తాజాగా విద్య మెమోరియల్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. మెమోరియల్‌లో ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ డార్లింగ్ విద్య అనే పదాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment