అభిమానిని ప్రమాదం నుంచి గట్టెక్కించిన విజయ్‌ | Viral: Doctor Treatment To Patient With Vijay Bigil Movie | Sakshi
Sakshi News home page

Vijay: అభిమానికి యాక్సిడెంట్‌, ఆదుకున్న విజయ్‌ సినిమా

Published Thu, Jul 8 2021 1:23 PM | Last Updated on Thu, Jul 8 2021 2:42 PM

Viral: Doctor Treatment To Patient With Vijay Bigil Movie - Sakshi

హీరోలను అభిమానించేవాళ్లే కాదు, ఆరాధించే వాళ్లకూ మన దగ్గర కొదవ లేదు. హీరోల కోసం ఏదైనా చేసే అభిమానులు.. వారి సినిమాలు చూస్తూ ఎక్కడ లేని సంతోషాన్ని పొందుతారు. తాజాగా ఓ బాల అభిమాని కూడా దళపతి విజయ్‌ నటించిన సూపర్‌ డూపర్‌ హిట్‌ బిగిల్‌(తెలుగులో విజిల్‌) సినిమా చూస్తూ తనను తాను మైమరిచిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా తమకు కావాల్సింది ఇదే అని ఆనందపడ్డారు. పిల్లవాడు సినిమా చూసి మైమరిచిపోతే అతడి కుటుంబం సంతోషపడటం ఏంటో అర్థం కాలేదా? అయితే ఇది చదివేయండి..

తమిళనాడులోని చెన్నైలో పదేళ్ల బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. గాయాలపాలైన అతడికి సర్జరీ చేయాల్సి వచ్చింది. దీంతో బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చిన్నపాటి ఇంజక్షన్‌ తీసుకోవడానికి కూడా అతడు అస్సలు సహకరించలేదు. దీంతో తల పట్టుకున్న వైద్యులకు ఆ బాలుడు స్టార్‌ హీరో విజయ్‌కు అభిమాని అని తెలిసింది. వెంటనే డాక్టర్‌ తన ఫోన్‌లో బిగిల్‌ సినిమా చూడమని ఇచ్చాడు. ఎంతో ఎగ్జైట్‌ అయిన ఆ పిల్లవాడు కన్నార్పకుండా సినిమా చూడటంలో లీనమయ్యాడు. అలా అతడికి సర్జరీ చేయడం తేలికైంది. ఈ విషయాన్ని తమిళ దినపత్రిక ప్రముఖంగా ప్రచురించగా, దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ రకంగా అతడి చికిత్స తీసుకోవడానికి కారణమైన హీరో విజయ్‌తో పాటు, వైద్యుడిని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement