ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది తమిళ భామ సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాలతో పాటు సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు రెడీగా ఉంటుంది. తాజాగా సాయి పల్లవి తన తాతయ్య 85వ పుట్టినరోజు వేడుకల్లో సంప్రదాయ చీరకట్టులో కనిపించి నిజంగానే అందరినీ ఫిదా చేసింది. నీలిరంగు పట్టు చీరలో అందంగా, ముద్దుగా మెరిసిపోతుంది.
ముఖంపై ఏ మాత్రం మేకప్ లేకున్నా కుందనపు బొమ్మలా కనిపిస్తోంది. తాతయ్య, అమ్మమ్మ, చెల్లెలితో కలిసి ఫోజులిస్తూ దిగిన ఫోటోలో ముఖం నిండా చిరునవ్వు.. అమితమైన సంతోషం కనిపిస్తోంది. ‘మూలాలు(రూట్స్).. తాత 85వ పుట్టినరోజు’ అంటూ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీనిపై సెలబ్రిటీలు, అభిమానులు స్పందిస్తున్నారు. నటి రాశీఖన్నా ‘బ్యూటీ’ అంటూ కామెంట్ చేసింది.
‘ప్లాస్టిక్ బ్యూటీ ఇండస్ట్రీలో సాయి పల్లవి నేచురల్ బ్యూటీ. నేచురల్ బ్యూటీ క్వీన్. బ్యూటీఫుల్’ అంటూ ఓ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ స్టోరీలో చేస్తుంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా రానా ప్రధాన పాత్రలో రూపొందుతున్న విరాట పర్వం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా ఈ హీరోయిన్‌గా చేస్తుంది.
చీరకట్టులో మెరిసిపోతున్న సాయి పల్లవి.. నిజంగా ఫిదానే!
Published Tue, Aug 3 2021 12:49 PM | Last Updated on Tue, Aug 3 2021 4:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment