
Keerthi Suresh Rakhi Video: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే(ఆగస్ట్ 22) సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయి. తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్ ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు చిరంజీవి. శనివారం నాడు మెగాస్టార్ హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న లూసిఫర్ రీమేక్ టైటిల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ అనే టైటిల్ చిత్రానికి ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇక ఆదివారం ఉదయం మెహర్ రమేశ్‌మూవీకి సంబంధించిన టైటిల్‌ని మహేశ్ బాబు చేతుల మీదుగా వదిలారు. చిరంజీవి నటిస్తున్న 154 వ చిత్రం ఇది. ఈ చిత్రానికి ‘భోళా శంకర్’అని టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(చదవండి: అన్నగా పుట్టినప్పటికీ తండ్రిలా సాకారు.. పవన్ ఎమోషనల్ పోస్ట్)
తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. రాఖీ పండగ సందర్భంగా ఈ చిత్రంలో చిరుకు సోదరిగా నటించబోతున్న హీరోయిన్‌ని ప్రకటిస్తూ అదరిపోయే వీడియోని వదిలారు. అందరూ ఊహించినట్లుగానే ఇందులో చిరంజీవికి చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిరుకు కీర్తి సురేష్ రాఖీ కడుతున్న వీడియోను వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment