కింగ్ నాగార్జున హీరోగా, బాలీవుడ్ నటి దియా మీర్జా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రంతో అహిషోర్ సాల్మోన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, రుద్ర ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని ఈ నెల 12 సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ‘‘హైదరాబాద్‌లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: షానీ డియో, సంగీతం: ఎస్. తమన్, సహ నిర్మాతలు: ఎన్.ఎం. పాషా, జగన్మోహన్ వంచా.
చదవండి: ఇదో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ..
Comments
Please login to add a commentAdd a comment