కష్టసుఖాలనేవి పగలు, రాత్రి వంటివి. ఒకటి పోగానే మరొకటి జీవితంలోకి వస్తుంది. కష్టాలైనా, సుఖాలైనా ఎల్లకాలం ఉండవు. రెండూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కానీ కష్ట సమయాల్లోనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. అలా తాను కూడా లవ్‌లో ఫెయిలనప్పుడు జీవితం అంటే ఏంటో తెలుసుకున్నానంటోంది బాలీవుడ్ నటి యశశ్రీ మాసుర్కర్.
పెళ్లి చేసుకోవాలనుకున్నా..
ఆమె మాట్లాడుతూ.. 'నేను ఓ అబ్బాయిని పిచ్చిగా ప్రేమించాను. అతడు కూడా ఇండస్ట్రీకి చెందినవాడే, కానీ నటుడు కాదు. అందరు అమ్మాయిల్లాగే నేను కూడా మా బంధం ఎంతో ధృడమైనది అనుకున్నాను, పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాము. కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? ఒకరోజు అతడు నా మనసు ముక్కలు చేశాడు. నన్ను మోసం చేశాడు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని లేదు. ఈ వివాహబంధం అంటేనే ఇష్టం లేదని చెప్పాడు. నాలుగేళ్ల మా ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికాడు.
మోసం చేశాడు, పిచ్చిదాన్నయ్యా..
నన్ను పూర్తిగా తన మైకంలో ముంచేసి ఇలా వదిలేస్తానని చెప్పడంతో పిచ్చిదాన్నైపోయాను. అతడికి పని దొరకనప్పుడు ఎంతో సాయం చేశాను. తనతో కలిసి కష్టసుఖాలు షేర్ చేసుకున్నాను. అలాంటిది ఇలా వదిలేస్తాననడంతో తట్టుకోలేకపోయాను. కానీ తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. నన్ను ఇలా డీలా పడేట్లు చేసేంత అధికారం ఒకరికి ఎందుకిచ్చాను? అని ప్రశ్నించుకున్నాను. ఓ తప్పుడు వ్యక్తిని ప్రేమించానని ఆలస్యంగా తెలుసుకున్నాను. అసలు పెళ్లి జోలికే వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను.
ఈ ప్రేమ, పెళ్లికో దండం..
ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను. నిజంగా ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. హాయిగా కలిసి మెలిసి ఉండవచ్చు. ఈ పెళ్లి గోల అవసరమే లేదు. ఏ మాటకామాట.. ఈ పెళ్లి, ప్రేమ కన్నా సింగిల్‌గా ఉండటమే నయమనిపిస్తోంది' అని చెప్పుకొచ్చింది. కాగా యశశ్రీ మసుర్కర్ లాల్ ఇష్క్, కబాద్: ద కాయిన్ సినిమాలు చేసింది. ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చేసిందీ బ్యూటీ. రంగ్ బదల్‌తీ ఒదానీ, చంద్రగుప్త మౌర్య, సంస్కార్:ధరోహర్ ఆప్నోన్ కీ, ఆరంభ్: కహానీ దేవసేన కీ సహా తదితర సీరియల్స్ చేసింది. ప్రస్తుతం దబాంగి: ముల్గి ఆయిరే ఆయి సీరియల్‌లో నటిస్తోంది. బిగ్‌బాస్ మరాఠి నాలుగో సీజన్‌లోనూ పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment