
ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త దర్శకుల హవా కొనసాగుతోంది. కొత్త కంటెంట్, కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తూ తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది గంధర్వ సినిమాతో దర్శకుడిగా అప్సర్ తన ప్రతిభను చాటుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే వినూత్నమైన కథాంశం యాంటి ఏజింగ్ ని ఎంచుకొని సాహసమే చేశాడు. ఈ సినిమా థియేటర్‌లో అంతగా ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
ఇక ఇప్పుడు అప్సర్ తన కొత్త సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. మరో ఆసక్తికరమైన పాయింట్‌తో పెద్ద నిర్మాణ సంస్థతో మరో ప్రాజెక్ట్ తో ఈ నెల ఆఖరున సెట్స్ మీదికి వెళ్ళనుండగా సినిమా గురించి త్వరలోనే అప్డేట్స్ ఇస్తానని దర్శకుడు చెప్పుకొచ్చారు.
(చదవండి: మంచు మనోజ్- భూమా మౌనిక లవ్‌స్టోరీ.. సినిమాకు మించి ట్విస్టులు!)
రెండో ప్రాజెక్ట్ ఇలా ఉండగా.. మూడో సినిమాను కూడా లైన్‌లో పెట్టేశారు. బడా ప్రొడక్షన్ హౌస్ తో మరో క్రేజీ కాంబో కూడా సెట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎవరు ఊహించని మరో రెండు కథలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని అప్సర్ అంటున్నాడు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment