బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొన‍్న దీప్తి సునయనకి కారు యాక్సిడెంట్? ఈ లైన్ చదవగానే మీరు షాక్ అయ్యారు కదా. కచ్చితంగా అయ్యే ఉంటారు. కారణం ఏంటో తెలీదు గానీ.. ఒకటి రెండు రోజులుగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడది స్వయంగా ఆమె వరకే వెళ్లడంతో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ ఏం చెప్పింది?
దీప్తి ఎవరు?
యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన.. పలు సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి ఆకట్టుకుంది. అయితే సహ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌తో ఈమె ప్రేమాయణం లాంటివి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. కొన్నాళ్లపాటు బాగానే ఉన్న ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు. ప్రస్తుతం ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈమెకు ప్రమాదం జరిగిందనే వార్తలు రావడంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడ్డారు.
(ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్‌బాస్ 7'.. కారణం అదే?)
ఏం చెప్పింది?
'నాకు ప్రమాదం జరిగిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేనైతే పూర్తి క్షేమంగానే ఉన్నాను. ఓ మూడేళ్ల క్రితం 'అలియా ఖాన్' అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. అందులో క్లిప్స్ తో ఇలాంటి వదంతులు క్రియేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు' అని దీప్తి సునయన చెప్పుకొచ్చింది.
షార్ట్ ఫిల్మ్‌లో ఏముంది?
అప్పట్లో ఉగ్రవాదులని ఎదురించి ప్రాణాలతో బయటపడిన మలాలా యూసఫ్‌జా జీవితం ఆధారంగా తెలుగులో తీసిన షార్ట్ ఫిల్మ్ 'అలియా ఖాన్'. దీప్తి సునయన నటించిన ఇందులో.. ఆమె యాక్సిడెంట్, హాస్పిటల్ బెడ్ పై ఉన్న సీన్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఫొటోలని ఉపయోగించి.. సోషల్ మీడియాలో ఆమెకి యాక్సిడెంట్ అని రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు క్లారిటీ రావడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు.
(ఇదీ చదవండి: 'జవాన్'లో షారుక్‌కి డూప్.. ఎంత రెమ్యునరేషనో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment